పెద్దపల్లి, డిసెంబర్ 24: పెద్దపల్లి కలెక్టరేట్‌లో కాక వర్ధంతి వేడుకలు జీఓ ఉన్న అధికారికంగా జరపకపోవడం బాధాకర మని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకా వేదన వ్యక్తం చేశారు. మంగళవారం పెద్దపల్లి ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఎంపి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి కలెక్టరేట్‌లో కాక వర్ధంతి వేడుకలు (ప్రభుత్వ జీఓ ఉన్నప్పటికీ) అధికారికంగా జరుపక పోవడం, కాకా గారినే కాదు యావత్ దళిత జాతినే అవమానపరిచినట్లుగా భావిస్తున్నా మని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుల పిచ్చితో, అగ్రకుల మైండ్ తో పనిచేస్తున్నాడని, జిల్లా ప్రజలే అతనికి తగిన బుద్ధి చెప్తారన్నారు. జిల్లాలో ఎంపీగా నాకు అధికారికంగా సమా చారం ఇవ్వకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారని, కలెక్టర్‌గా మెజిస్ట్రేట్ హోదాలో ఉండి కనీసం ప్రజా ప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నాకు ప్రోటోకాల్ ఇవ్వక పోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నమన్నారు. అయినప్పటికీ ప్రజలు నన్ను ఎంపిగా గెలిపించారని, జిల్లా ప్రజల సమస్యల పై నిరంతరం కృషి చేస్తానని, ఈ అంశం పై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ దృష్టికి తీసుకు వెళ్తనని ఎంపీ అన్నారు.