calender_icon.png 19 April, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి కంటెంట్ అందించే ప్రయత్నమే డియర్ ఉమ చిత్రం

13-04-2025 12:00:00 AM

తెలుగమ్మాయి సుమయరెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ నిర్మాతగా, రచయితగా వ్యవహరిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. పృథ్వీఅంబర్ హీరోగా నటిస్తుండగా.. సాయిరాజేశ్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. నగేశ్ లైన్ ప్రొడ్యూసర్ గా, నితిన్‌రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుమయరెడ్డి మా ట్లాడుతూ.. ‘ఓ మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని అనుకున్నా. కథ రాస్తుండగా ఎంతో కంటెంట్ వచ్చేది. రాజేశ్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఆయన తన కథలన్నీ పక్కన పెట్టి నా కథపై దృష్టి పెట్టారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారా అనుకుంటున్న సమయంలో మా అమ్మ అండగా నిలిచారు. నా విజయం వెనుక నా టీమ్ ఉంది’ అన్నారు. పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. ‘తెలుగులో దియా తర్వాత నా మీద ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది.

ఇది నా మొదటి తెలుగు సినిమా కావడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. డైరెక్టర్ సాయిరాజేశ్ మహదేవ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం సుమయ ఎంతో కష్టపడ్డారు. అన్ని క్రాఫ్ట్‌ల మీద ఆమెకు నాలెడ్జ్ ఉంది. ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రధన్, కమల్ కామరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నితిన్‌సాయిచంద్రారెడ్డి,  లైన్ ప్రొడ్యూసర్ నాగేశ్, ఎడిటర్ సత్య, హీరోయిన్ సుమయరెడ్డి తల్లి జ్యోతిరెడ్డి, లోబో, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.