calender_icon.png 3 April, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యం పక్కదోవ పట్టకుండా డీలర్లే చూడాలి : ఎమ్మెల్యే

03-04-2025 01:16:58 AM

టేకులపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సన్న బియ్యం పక్కదోవ పట్టకుండా డీలర్లే చూడాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామమంలో బుధవారం సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్నవారంతా సన్న బియ్యం అమ్ముకోవద్దని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవిన్యూ సిబ్బంది కూడా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా, తహసీల్దార్ నాగ భవాని, జీసీసీ మేనేజర్ నర్సింహారావు, ఎంపీడీఓ రవీంద్ర రావు, ఎంపీవో గణేష్ గాంధీ, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అద్యక్షుడు ఊకె శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈది గణేష్, మంగీలాల్ తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.