calender_icon.png 20 April, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లులపై రాష్ట్రపతికి గడువు.. సమీక్ష కోరనున్న కేంద్రం!

14-04-2025 11:36:31 PM

న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు అంగీకరించేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు మూడు నెలల గడువును సుప్రీంకోర్టు విధించడంపై కేంద్ర ప్రభుత్వం సమీక్షను కోరే అవకాశముంది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడంపైనా సమీక్షను కోరవచ్చని ఈ పరిణామంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.

రివ్యూ పిటిషన్‌ను ఏ ప్రాతిపదికపై దాఖలు చేయాలనే దానిపై ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిపాయి. ఈ నెల 8న తీర్పు వెలువరించిన జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనానికే ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.