19-02-2025 01:34:18 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కాలపరిమితి పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ర్టంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో నవంబర్ 11న ఏకసభ్య కమిషన్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే.
ఎస్సీ వర్గీకరణపై కమిషన్ 60 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాల్సి ఉండగా, జనవరి 10తో గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వం మరో పది రోజులు పొడిగించింది. ఇటీవలే ప్రభుత్వానికి సమ ర్పించిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ సహ కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు కమిషన్ తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది.