calender_icon.png 9 March, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇవాళ ఖరారు కానున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు

09-03-2025 09:10:05 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ లో తుదిదశకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆదివారం పూర్తి కానుంది. ఇవాళ మధ్యాహ్నంలోపు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ విడివిడిగా ఫోన్లు చేసి అభిప్రాయ సేకరణ జరిపించారు. కోర్ కమిటీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యుక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని సేకరించిన మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. ఇవాళ ఏఐసీసీ నివేదికను పరిశీలించి మధ్యాహ్నానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న 4 ఎమ్మెల్సీల్లో  ఒకటి సీపీఐకి కేటాయించే అవకాశం ఉంది.