calender_icon.png 15 January, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో పాపం.. చెరువులో నవజాత శిశువు మృతదేహం

15-01-2025 07:56:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో బుధవారం ఏడు నెలల నవజాత శిశువు మృతదేహం చెరువులో కనిపించడం కలకలాన్ని సృష్టించింది. గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువులో నవజాత శిశువు శవం నీటిలో తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిలో ఉన్న నవజాత శిశువుని బయటకు తీసి సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఏ తల్లి కన్నబిడ్డనో కళ్ళు తెరవక ముందే నీటిలో శవమై తేలడంతో ఆ గ్రామంలో విషాదం నింపింది. మృతదేహం గ్రామాంజ లేక ఇతర ప్రదేశాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారా అనే కోణంలో పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా విచారణ జరుపుతున్నారు.