calender_icon.png 26 December, 2024 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోనెసంచిలో మృతదేహం

25-12-2024 01:20:54 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 24: మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు శుభ్రం చేస్తుండగా మురుగు కాల్వలో ఓ గోనెసంచి కనిపించింది. అందులో మృతదేహం కనిపించడంతో డయల్ 100కు కాల్ చేసి విషయం తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ నరేందర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. వ్యక్తిని దుండగులు వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.