మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిలేరు పంచాయతీ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. గత 20 రోజుల క్రితమే మృతి చెందినట్లు మృతదేహాన్ని చూస్తే అర్థమవుతుంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్(SI Ranjith) ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహం పూర్తిగా గుర్తుపట్టని పరిస్థితిలో ఉండడంతో మృతదేహం ఎవరిది అన్నది చెప్పలేని పరిస్థితి.