రాజేంద్రనగర్,(విజయక్రాంతి): గోనే సంచిలో ఓ డెడ్ బాడీ కనిపించడం సంచలనం రేపిన సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దుర్గా నగర్ చౌరస్తా సమీపంలో గోనే సంచిలో వృతదేహం పడి ఉంది. ఈ విషయం గమనించిన జీహెచ్ఎంసీ కార్మికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుండగులు వ్యక్తిని ఇతర ప్రాంతంలో హత్య చేసి గుణసంచిలో మూట కట్టుకొని వచ్చి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. క్లూస్ టీం, సీసీ కెమెరాల ద్వారా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు ఎవరనే విషయం తెలిసే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.