24-03-2025 10:07:14 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు అందినట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ విజయ సారధి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్లారెడ్డి మండల పరిధిలోని అడవిలింగాల గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి పైనుంచి వెళ్లిన లైన్ మార్పు గురించి దరఖాస్తు చేసారని, అలాగే నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఇద్దరు రైతులు నూతన విద్యుత్ కనెక్షన్ కోసం కోరారని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి వారి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.