జనగామ, ఆగస్టు 31(విజయక్రాంతి): రైతు వద్ద లంచం తీసుకుంటూ విద్యుత్ డీఈ ఏసీ బీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలా నికి చెందిన కుంభం ఎల్లయ్య అనే రైతు 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కోసం రూ.16 లక్షల డీడీ కట్టా డు. డీడీ కట్టి రెండు నెలలుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా పని కావడంలేదు. పని కావాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డీఈ హుస్సేన్‌నాయక్ రైతును డిమాం డ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనతో శనివారం సాయంత్రం స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ డీఈకి రూ.20 వేలు ఇస్తుండగా ఏసీ బీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు.