calender_icon.png 26 November, 2024 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీ డీ రవీందర్ రెడ్డి

26-11-2024 06:03:48 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక ప్రభుత్వ దళిత బాలుర వసతి గృహాన్ని ఆ శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. అంతేకాకుండా వసతి గృహాంలో వినియోగిస్తున్న ఆహార పదార్థాలు, వసతి గృహానికి సరఫరా అవుతున్న నిత్యావసర సరుకుల నాణ్యత గురించి వసతి గృహ సంక్షేమాధికారి రాజును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేవలం నాణ్యమైన సరుకులనే ఆహరంలో వినియోగించాలని, ప్రభుత్వం నుంచి సంబంధిత కాంట్రాక్టర్ లకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని డీ డీ వివరించారు.

ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. స్టాక్ రూమ్ ను సందర్శించి పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వసతి గృహ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో డీ డీ వెంట వసతి గృహ సంక్షేమాధికారులు రాజు, రాజు కుమార్, సిబ్బంది ఉన్నారు.