గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి
కుమ్రం భీం అసిఫాబాద్, (విజయ క్రాంతి): విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సెంట్ మేరీ పాఠశాలలో అత్యా పత్య తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక పోటీలను నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను ప్రారంభించిన రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు బాల్యంలో విద్య ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యా పత్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖేష్ ,జిల్లా అధ్యక్షుడు కాట్ కార్ భీమ్రావు, హ్యాండ్ బాల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, అత్యా పత్య కార్యదర్శి కిరణ్, అత్యా పత్య ఇంటర్నేషనల్ క్రీడాకారుడు అమర్ సింగ్ ,కేలో ఇండియా కోచ్ రాకేష్ ,హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్, కోకో కోచ్ తిరుమల్ తదితరులు ఉన్నారు.