calender_icon.png 19 April, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయల మార్కెట్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన డిసిపి

24-03-2025 10:38:08 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ భవనంలో సోమవారం నూతన సీసీ కెమెరాలను మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ ప్రారంభించారు. 16 సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని డిసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య,  ఎస్ఐ రాకేష్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.