25-04-2025 09:32:38 PM
చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూరు పోలీస్ స్టేషన్ ను శుక్రవారం సాయంత్రం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Aggadi Bhaskar) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొందరు సంఘవిద్రోహాక శక్తులు అక్రమంగా గుమిగూడి గొడవలు చేసే సమయంలో వారిని ఏ విదంగా చెదరగొట్టాలో వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి ఆత్మ స్థైర్యంతో పనిచేయాలని తగు సూచనలు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ దేవేందర్ రావు, ఎస్సైలు సుబ్బారావు, వెంకటేశ్వర రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.