13-03-2025 12:27:15 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను బుధవారం మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాది దారులపై పోలీసులు గౌరవంగా మెదలాలని సూచించారు. అనంతరం బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యలపై పోలీసు అధికారులకు పాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, సిఐలు ఎన్ .దేవయ్య, అఫ్జలుద్దీన్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.