25-02-2025 10:45:29 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను మంగళవారం మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతి భద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా, ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటుందని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు, 21 లొకేషన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా ఎన్నికల నియమాలిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.