25-02-2025 05:48:23 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా బుధవారం బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగే జాతర ఏర్పాట్లు మంగళవారం సాయంత్రం మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆయన సూచించారు. బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జరిగే బుగ్గ జాతరలో బందోబస్తు నిర్వహణ కోసం ఏసీపీ ఏ.రవికుమార్ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 120 మంది పులి సిబ్బందిని నియమించినట్లు డిసిపి తెలిపారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించి జాతర విజయవంతానికి సహకరించాల్సిందిగా కోరారు. అనంతరం డీసిపి భాస్కర్, ఏసిపి రవికుమార్ లు శివాలయంలో పూజలు చేశారు. భాస్కర్ వెంట ఏసిపి రవికుమార్, సిఐలు సయ్యద్ అఫ్జలుద్దిన్, దేవయ్య లతో పాటు తాళ్ల గురజాల ఎస్సై చుంచు రమేష్ ఉన్నారు.