- జంగుబాయి జాతరకు వెళ్తుండగా ఘటన
- వాహనంలో 60 మంది.. పలువురికి గాయాలు
ఆదిలాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతరకు వెళ్తున్న డీసీఎం నార్నూర్ మండలంలో బోల్తా పడింది. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆదివాసీలు జంగుబాయి జాతరకు డీసీఎంలో బయలుదేరారు. నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్ వద్ద డీసీఎం బ్రేక్ ఫెయిలై బోల్తా పడింది. పలువురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఉట్నూర్, ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.