calender_icon.png 18 January, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసిడ్ తాగి డీసీఎం డ్రైవర్ ఆత్మహత్య

08-08-2024 03:23:01 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఆర్ధిక ఇబ్బందులతో ఓ డీసీఎం డ్రైవర్ యాసిడ్ తాగి ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు.. మహబూ బాబాద్ జిల్లా, కురవి మం డలం, చాంద్య తండాకు చెందిన మాలోతు వాసు (32) కొన్నేళ్లుగా నగరంలోని బోడుప్పల్‌లో నివా సం ఉంటున్నాడు. వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్న వాసు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది గతనెల 31న యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు  పోలీ సులు అతడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికి త్స పొందుతూ బుధవారం వాసు మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.