08-04-2025 09:59:15 PM
పాపన్నపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పాపన్నపేట డిసీసీబీ బ్యాంక్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు లభించింది. ఈ మేరకు డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సీఈవో శ్రీనివాస్, డిడిఎంలు కృష్ణ తేజ, నిఖిల్ కుమార్ ల చేతుల మీదుగా పాపన్నపేట బ్యాంక్ మేనేజర్ కిషన్ సంగారెడ్డిలో ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ... పాపన్నపేట బ్యాంక్ మేనేజర్ గా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు 39 కోట్ల బిజినెస్ కొనసాగేదని తాము వచ్చాక 51.5 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. 35 శాతం అభివృద్ధి సాధించిందని ఆయన వివరించారు. ఉమ్మడి జిల్లాలో తమ బ్యాంకుకు ఉత్తమ ప్రతిభ అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. తమ బ్యాంకులో గోల్డ్ లోన్, లాంగ్ టర్మ్ తదితర రుణాలు పెద్ద ఎత్తున అందిస్తున్నామని వెల్లడించారు. బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నామని తులం బంగారంకు 58 వేల వరకు ఇస్తున్నట్లు ఆయన వివరించారు.