15-02-2025 02:17:02 PM
సమర్థవంతంగా రైతులకు అండగా ముందుకు సాగుతాం
డిసిసిబి అధ్యక్షులు మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి
మహబూబ్ నగర్: ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని డిసిసిబి అధ్యక్షులు మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి(DCCB President Mamilla Vishnuvardhan Reddy) అన్నారు. డిసిపి పాలకవర్గ పదవీకాలం ఆరు నెలలు పొడిగించడం సందర్భంగా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటామని పేర్కొన్నారు. మాపై నమ్మకం ఉంచి పదవి కాలం పొడిగించడం పట్ల సహకార సంఘం ద్వారా అందరికీ అండగా ఉంటామని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Anumula Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రిజూపల్లి కృష్ణారావు ,ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 12 మంది శాసనసభ్యులకు డిసిసిబి మహబూబ్ నగర్ పక్షాన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పదవి కాలాన్ని తాను ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంలో మరో ఆరు నెలలు పొడిగించి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఇంకా బలోపేతం చేసి కొత్త బ్యాంకులను ఓపెన్ చేసి యూపీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలను తీసుకుస్తావని తెలిపారు. బ్యాంకు టర్నోవర్ రూ 2000 కోట్ల వరకు తీసుకెళ్లడానికి భవిష్యత్తులో ఇంకా కొత్త పాలసీలను ప్రవేశపెట్టి రైతులకు మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.