calender_icon.png 27 February, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలకంఠేశ్వరున్ని దర్శించుకున్న డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి...

26-02-2025 10:24:16 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నీలకంఠేశ్వర స్వామిని డిసిసిబి డైరెక్టర్, కాంగ్రెస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య బుధవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహింఛారు. స్వామి తీర్థ ప్రసాదాలు, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివ-పార్వతుల దీవెనలు పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని శ్రీ నీలకంఠేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమితి సింగారం పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, శివాలయం దేవాదాయ శాఖ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐతనబోయిన సతీష్, శివాలయం గుడి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.