calender_icon.png 21 November, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసింది కేసీఆరే

03-11-2024 07:55:06 PM

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న సీఎం రేవంత్ రెడ్డి 

డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుతో 7,65,700 మంది విద్యార్థులకు ప్రయోజనం

 డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి

గజ్వేల్,(విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, మాజీ సీఎం కెసిఆర్ పేదలకు విద్యను దూరం చేశారని డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్ మహిళా ఎడ్యుకేషన్ హబ్ లో గురుకులాలు హాస్టల్ల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి హాస్టల్ బాలికలు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి,  ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ లు పాల్గొని ప్రసంగించారు.

 ప్రభుత్వ విద్యారంగాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయగా, గురుకుల, ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు కనీసం కాస్మోటిక్ చార్జీలు కేసీఆర్ పెంచలేదని ఆరోపించారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతూ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడంతో పేద విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ... గతానికి భిన్నంగా డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయగా, జీర్ణించుకోలేని కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం వల్ల ప్రభుత్వ రెసిడెన్షియల్, సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న 7,65, 700 ప్రయోజనం కలిగిందని, ఈ జీవో విడుదల చేయడంతో పాటు వెంటనే వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో పేద విద్యార్థుల నుండి సంతోషం వ్యక్తం అవుతున్నట్లు తెలిపారు. కాగా డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపును 3 నుంచి 7వ తరగతి వరకు రూ 950 నుండి రూ.1330,   8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1540, ఇంటర్‌ నుంచి పీజీ వరకు డైట్ ఛార్జీలను రూ 1,500 నుంచి రూ.2,100కు పెంచినట్లు స్పష్టం చేశారు. 

పాటు 3 నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.55గా ఉన్న కాస్మోటిక్‌ ఛార్జీలను రూ.175కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకుందన్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు కాస్మోటిక్ ఛార్జీలలను రూ.75 నుంచి రూ.275కి పెంచారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల తరుపున నర్సారెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ వార్డెన్లు లక్ష్మి, స్వప్న, జగదేపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఏఎంసి డైరెక్టర్ నర్సింహారెడ్డి, వహీద్, నాయకులు సుభాష్ చంద్రబోస్, గంగిశెట్టి రాజు, నక్క రాములు జహీర్, తదితరులు పాల్గొన్నారు.