calender_icon.png 1 March, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ అధ్యక్షుడికి క్షమాపణలు చెప్పాలి

01-03-2025 01:34:43 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి28( విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ పై నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో కలసి మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు కార్యకర్తలను ఉత్సాహపరిచేలా ఉండాలి కానీ నిరుత్సాహ పరచకూడదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శ్యామ్ నాయక్ డీసీసీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావు మాట్లాడుతూ శ్యామ్ నాయక్ పారాషూట్ లాంటి వాడని అవకాశవాది అని ఆరోపించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతిపక్షంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్న ప్రసాద్ అన్నను విమర్శిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.

కొంతమంది నాయకులను వెంటవేసుకొని పార్టీకి నష్టం చేసేలా శ్యామ్ నాయక్ పనిచేస్తున్నారని అధిష్టానం గమనించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో ఉంటూ పార్టీ నాయకులపై అట్రాసిటీ కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఓటమికి శ్యాం నాయక్ వ్యవహార శైలి కారణమని స్పష్టం చేశారు. త్వరలోనే నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. మాసాడే చరణ్ మాట్లాడుతూ  డిసిసి విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

జిల్లా నాయకుడు దుర్గం దేవాజి మాట్లాడుతూ విశ్వ ప్రసాద్ రావుకు శ్యాం నాయక్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు అనిల్ గౌడ్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లేష్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, నాయకులు సలీం, ప్రకాష్ ,దీపక్ ముండే ,కలీం , నారాయణ, మారుతి ,సాయి, రవీందర్, దత్తు ,బాబురావు తదితరులు పాల్గొన్నారు.