26-01-2025 04:33:23 PM
మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మరి నరసింహారెడ్డి జన్మదిన వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నరసింహారెడ్డి చేత కేకు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నరసింహారెడ్డి మేడ్చల్ పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక మాట్లాడుతూ... తన వెన్నంటే ఉండి సలహాలు సూచనలు ఇచ్చారన్నారు.