27-04-2025 05:10:42 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 29 నిర్మల్ జిల్లా కేంద్రంలో డీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం(DCC Executive Meeting) నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ఆదివారం తెలిపారు. ఖానాపూర్, నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, లైబ్రరీ చైర్మన్, పార్టీ యువజన, మహిళ, రైతు, విద్యార్థి విభాగం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పీసీసీ సభ్యులు, సేవాదళ్ అధ్యక్షులు, ఆయా పట్టణ, మండలాల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు సమావేశానికి హాజరుకావాలని కోరారు. స్థానిక మంజులాపూర్ రోడ్ లోని మారుతి ఇన్ హోటల్ లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, అవేజ్ లు హాజరవుతున్నారని పేర్కొన్నారు.