calender_icon.png 18 November, 2024 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్, మేడ్చల్‌లో డీసీఏ దాడులు

18-11-2024 12:04:18 AM

రూ.1.25 లక్షల కాలం చెల్లిన మందులు సీజ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): గ్రేటర్‌లో పలు చోట్ల డ్రగ్స్ కంట్రోల్ అధికారులు (డీసీఏ) దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని గాయత్రి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, మేడ్చల్‌లోని పలు మెడికల్ షాపులు, కిరాణ దుకాణాల్లో నిర్వహించిన దాడుల్లో కాలం చెల్లిన 45 రకాల మందులను సీజ్ చేశారు.

వాటి విలువ రూ.1.25లక్షలు ఉం టుందని అధికారులు తెలిపారు. దాడుల్లో డీసీఏ అధికారులు డీ సరిత, బీ గోవింద్‌సింగ్, సురేంద్రనాథ్, రేణుక, తదితరులు పాల్గొన్నారు. రామంతాపూర్‌లో నిర్వహించిన దాడుల్లో అనుమతి లేకుండా అమ్ముతున్న క్లోరమ్ పెనికల్ పీడీ కోల్ ఐ ఆయింట్‌మెంట్ ఐపీ అనే మందును సీజ్ చేశారు.