calender_icon.png 23 December, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ జిల్లాలో డీసీఏ తనిఖీలు

23-12-2024 02:23:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలోని స్వప్న క్లినిక్‌లో శామీర్‌పేట్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో డీసీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వప్న అనే మహిళ సరైన అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రూ.14 వేల విలువ గల 38 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. రంగా రెడ్డి జిల్లా షాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో ‘సక్రాల్‌ఫేట్ ఓరల్ సస్పెన్షన్’, మేడ్చల్‌లో నిర్వహించిన తనిఖీల్ల్లో లేడీ టానిక్ డీఎస్ అనే మందులను షాబాద్, మేడ్చల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అన్వేశ్, మౌనిక, డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.