అధిక ధరలకు విక్రయిస్తున్న మందులు సీజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24(విజయక్రాంతి): అంబర్‌పేట లోని ఓ మెడికల్ షాప్‌లో డ్రగ్స్ కం ట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరకు అమ్ముతున్న ఇట్‌వేజ్-200 ట్యాబ్లెట్ల ను సీజ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్ము తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పది ట్యాబ్లెట్ల ను రూ.22.12 లకు విక్రయించాల్సి ఉండగా.. రూ.221.2కు అమ్ముతున్న ట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో అంబర్‌పేట్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వీ అజయ్, తదితరులు పాల్గొన్నారు.