29-04-2025 10:19:05 PM
ఎల్బీనగర్: జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్వీ కర్ణన్ ని మంగళవారం తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ కృష్ణ, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ మంద రవి, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, సెక్రటరీ మురళి, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ బలరాం, సూపరింటెండెంట్ మహేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.