calender_icon.png 1 April, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఘోర ఓట‌మి..

30-03-2025 07:11:31 PM

వైజాగ్: ఐపీఎల్ 2025 లో భాగంగా విశాఖపట్నంలోని వీడీసీఏలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) ఘోర ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 16 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టంతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డుప్లెసిస్(50), జేక్ ఫ్రేజర్(38), అభిషేక్ పోరల్(34) రాణించారు.

ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ మాత్రమే 3 వికెట్లు తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ (74) అర్థసెంచరీతో మెరిశాడు. హెన్రిచ్ క్లాసెన్ (32), ట్రావిస్ హెడ్(22) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో టాప్ లో నిలవగా, కుల్ దీప్ యాదవ్ 3, మోహిత్ శర్మ ఒక వికెట్ తో రాణించారు.