తెలంగాణలో అక్కడక్కడ మునుల ఆనవాళ్లు, వాళ్లకు సంబంధించిన గుహలున్నాయి. నల్గొండ జిల్లా చందంపేట మండలం సమీపంలోని కృష్ణానదీ లోయలో మునుల గుహలు ఉన్నాయి. మండలంలోని కాచరాజుపల్లికి దగ్గగా ఉన్న గుట్టల వరుసలో ఈ గాజుబేడం గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో చూపరుల మనసును కట్టిపడేశాలా దర్శనమిస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు బాహ్య ప్రపంచానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి.
ఈ గుహ లోపలికి అడుగుపెట్టగానే కళ్ళు చెదిరే రంగుల గోడలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ మునుల గుహ లేదా భావోజి గుహగా పిలుచుకునే ప్రాంతంలో ఏర్పడిన గుహాంతర్భాగాలు సొరంగాలుగా, అంతస్తులుగా ఎంతో నేర్పరులైన శిల్పులు చెక్కినట్లుగా కనిపిస్తాయి. ఉలితో చెక్కినట్టుగా ఇక్కడి రాతిగోడలు, అందమైన ఆకృతులు అద్భుతమైన రాతి ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతిని అందిస్తాయి.
లోపలి భాగంలో ఒకచోట ఎరుపు రంగు, మరొకచోట నారింజ రంగుతోపాటు గుహలో ఆక్వామెరీన్ రంగులో మిరుమెట్లు గొలిపేలా కపబడతాయి. అరు దైన గుహలుగా.. ఈ రాతిగోడలు ఇలా రంగులతో మెరిసిపోసిపోవడానికి కారణం అగ్నిపర్వతంలో లావా ప్రవాహం ప్రభావమని నిపుణులు అంటున్నారు.
లావా వేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గోడలకు ఈ అరుదైన వర్ణాలు అద్దినట్లు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఈ గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే అరుదైన గుహలుగా మంచి విహార స్థలంగా రూపు దిద్దుకునే అవకాశం ఉంది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు కొత్త హంగులు దిద్దడం ద్వారా అది సాధ్యమవుతుందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.