- రాష్ట్ర ప్రభుత్వ విజన్‌ను తెలియజేసే విధంగా కార్యక్రమాలు
- క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ర్టవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించ నున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు.
శనివారం విజయోత్సవాల నిర్వహణపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింద న్నారు. వాటిని వివరిస్తూ.. ప్రభుత్వ విజన్‌ను తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు, 50వేల ఉద్యోగాలు, రూ. 18 వేల కోట్ల రుణాల మాఫీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
రేయన్స్ పరిశ్రమను తెరవబోతున్నాం..
మూతపడిన కమలాపూర్ రేయన్స్ పరిశ్రమను 4వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామని డిప్యూ టీ సీఎం చెప్పారు. ఈ ప్రజా విజయోత్సవాల వేళ పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వేడుకల కాలంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.
వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తామన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్,16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభో త్సవం, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ర్ట డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు కూడా ఉంటాయని వివరించారు. పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమావేశానికి రాష్ర్ట ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ర్ట సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయ రాజ్, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ముఖ్య కార్యదర్శులు రవీ గుప్త, క్రిస్టినా జోంగ్తు, ఎం. శ్రీధర్, కార్యదర్శి దాసరి హరిచందన, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.