కల్యాణం కమనీయం చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ప్రియా భవానీ శంకర్. గ్లామర్‌కు దూరంగా ఉంటూనే మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. “ఒక పెద్ద హీరో చిత్రంలో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషంగా చిత్రీకరణలో పాల్గొన్నా. 55 రోజుల పాటు ఎండా, వాన ఏమీ పట్టించుకోకుండా నటించా.
షూటింగ్ పూర్తయ్యాక డబ్బింగ్ చెప్పేందుకు వెళ్లా. అక్కడ తన పాత్ర నిడివి చూసి షాక్ అయ్యాను. 5 నిమిషాల కంటే తక్కువగానే ఉంది. అసలు నాకు చెప్పిన కథేంటి? నాతో చేసిన షూటింగ్ ఏమైందని దర్శకుడిని అడిగా. మ్యూజిక్‌లో వస్తుంది చూడమని చెప్పారు. వెంటనే చిత్ర హీరోకు ఫోన్ చేసి విషయం చెప్పా. ‘నేను 135 రోజులు షూటింగ్ చేశా. నా సన్నివేశాలే లేవు అని చెప్పారు’ అని ప్రియా భవానీ శంకర్ చెప్పారు.
ఆ చిత్రం ఏంటి? దర్శకుడెవరు? హీరో ఎవరు? వంటి విషయాలను ఆమె చెప్పలేదు. ప్రియా భవానీ శంకర్ న్యూస్ రీడర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆపై తమిళ సీరియల్స్‌లో నటించారు. అక్కడ వచ్చిన గుర్తింపుతో వెండి తెరపై కూడా మంచి అవకాశాలను రాబట్టి కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. డీమాటీ కాలనీ ఇండియన్ 2, రత్నం తదితర చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం హీరో జీవా సరసన బ్లాక్ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ నటించారు.