- 11 నుంచి సంక్రాంతి సెలవులు
- సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలే
- కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 11 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటిం చింది. ఈ నెల 11 నుంచి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులను ఇంటర్ బోర్డు మంగళవారం ప్రకటించింది. 17న తిరిగి కళాశాలలు పునఃప్రారం భమవుతాయని తెలిపింది.
సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వ హించకూడదని కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఒక వేళ నిర్వ హిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో మొత్తంగా కాలేజీలకు 6 రోజులపాటు సెలవు లొచ్చాయి.
ఇక పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్‌లో 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో స్కూళ్లకూ అదనంగా మరో రెండు రోజులు సెలవులొ చ్చాయి. దీంతో 7 రోజులపాటు సెలవులివ్వాల ని విద్యాశాఖ నిర్ణయించింది. 18న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.