calender_icon.png 11 January, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగలే వెన్నెల....

15-09-2024 01:39:07 PM

- విద్యుత్తు దుబారా....

మందమర్రి, విజయక్రాంతి : విద్యుత్, మున్సిపల్ అధికారుల ఉదాసీనత సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా విద్యుత్ దుబారా జరుగుతుంది. విద్యుత్ దుబారాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా పట్టపగలే విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఘటన మున్సిపల్ పరిధిలోని 6 వ వార్డ్ నార్లాపూర్ లో చోటుచేసుకుంది. గత వారం రోజులుగా పట్టపగలే వీధి దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నప్పటికీ వాటిని సరిచేసి విద్యుత్ దుబారాను అరికట్టాల్సిన సిబ్బంది ప్రేక్షకపాత్రకు పరిమితం కావడంతో మున్సిపల్ పరిధిలో విద్యుత్ దుబారా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.  ఏదేమైనప్పటికీ పట్ట పగలే విద్యుత్ దీపాలు వెలుగులు ప్రసరిస్తుండడంతో మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ దుబారా పెరిగిపోయి ప్రజలపై భారం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగకుండా చర్యలు చేపట్టి విద్యుత్ దుబారా అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.