calender_icon.png 28 December, 2024 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరులో హైడ్రా రెండో రోజు పర్యటన

08-11-2024 01:22:12 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలో చెరువుల పరిరక్షణ తీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రెండో రోజు శుక్రవారం దొడ్డతోగూరు చెరువును సందర్శించారు. ఇక్కడ మురుగు నీటిని నాలుగైదు దశల్లో ప్రకృతి సహజ సిద్ధంగా శుద్ధి చేసి మైన్ చెరువులోకి పంపిస్తున్న తీరును హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బృందానికి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మళ్లీ గవాడ్ వివరించారు. చెరువులను సహజ సిద్ధంగా వివిధ దశల్లో అభివృద్ధి చేయడం ఎలా అంశంపై హైడ్రా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.