calender_icon.png 30 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్ మా విజయం

29-01-2025 01:08:37 AM

  1. రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యం 
  2. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి
  3.  రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు 
  4. ఇన్వెస్ట్‌మెంట్స్ రాకుండా కొందరు కుట్ర చేశారు
  5. ప్రపంచదేశాలు చైనాకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నాయి 
  6. స్కిల్ వర్సిటీ కోసం సింగపూర్‌లోని
  7. ఐటీఈ సంస్థతో ఒప్పందం 
  8. ఒకాయన అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నారు
  9. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలి యన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటనతో రాష్ట్రంలో రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేలా ఆకర్షించా మని తెలిపారు.

ఇది తమ ప్రభుత్వం సాధించిన కీలక విజయమని, జ్యురిచ్, దావోస్‌లో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో 51 వేల ఉద్యోగాలు లభిస్తాయ ని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సాధించిన పెట్టుబడులపై సీఎం మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణకు  పెట్టుబడులు రాకుండా కొందరు  కుట్ర చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దిపై దుష్పచారం చేశారని మండిపడ్డారు. అయినా మన రాష్ట్రం మీద ఉన్న నమ్మకంతో భారీ గా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వివాదాలకు వెళ్లొద్దని సీఎం హితవు పలికారు.

పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపు లు, అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సీఎం చెప్పారు.  తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.

స్కిల్ యూనివర్సిటీ కోసం సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. మన స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్బుత పరిణామమని,  సాంకేతికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

విఫలమవుతామని ఆశపడ్డారు..  

‘విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావాలనేది మా ప్రయత్నం. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు దావోస్‌కు వెళ్లాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాం. కానీ   వాళ్లు ఇక్కడి నుంచి విదేశాలకు తరలించారు. ఇక్కడ గొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారు.

మేం విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని కొందరు చూశారు. ఇతర రాష్ట్రాల కంటే గొప్పగా పెట్టుబడులు సాధించాం. అసూయతోనే మమ్మల్ని అభినందించడం లేదు, భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపుమంటగా మారింది. ప్రతిపక్షంలో ఓ  నేత అటెన్షన్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నారు.

ఆయనకి మంచి వైద్యం అందించాల్సి ఉంటుంది.  చాలా సంస్థలు మన పెవిలియన్‌కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పెట్టుబడులు రాలేదనే అక్కసుతో ఉన్నారు. నూతన ఎనర్జీ పాలసీ వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. చైనాకు ప్రత్యా మ్నాయమైన దేశాన్ని ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి.

పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్న నగరాల వైపే అంతర్జాతీ య సంస్థలు చూస్తాయి. అందుకు హైదరాబాద్ ముందు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది’ అని సీఎం వివరించారు. దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలనుం టున్న వారికి శ్వేతపత్రం అంటే ఎంటో అర్థం తెలుసా..? అని నిలదీశారు.

దావోస్‌లో జరిగిన ఒప్పందాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిపామని, ఒక వేళ ఎవరికైనా నమ్మకం లేకుంటే ఆ కంపెనీలను అడిగి తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పుడు ఎంగెజ్‌మెంట్ జరిగిందని, లగ్నపత్రిక రాసుకున్నామని, మిగతా పనులు కూడా పూర్తవుతాయని ముఖ్యమంత్రి అన్నారు.  

కొందరు రాష్ట్ర సొమ్మును విదేశాలకు పంపారు

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో.. వారు ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి లండన్‌లో పెట్టుబడులు పెడితే.. మేం ప్రజల కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రజల సొమ్మును కొల్లగొట్టారని వారిపై కేసులు కూడా నమోదైన విషయాన్ని వివరించారు.

ప్రజల కోసం రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినందుకు మమ్మల్ని అభినందిస్తున్నారని, తాము దావోస్‌కు వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికన్నారు. సంస్థ లు ఎక్కడివైనా వారి దగ్గరున్న డబ్బులను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతిమంగా రాష్ట్రంలో పరిశ్రమలు యువత ఉపాధి అవశాలు మెరుగుపర్చాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

రాష్ట్రానికి చెందిన కంపెనీ లతో దావోస్‌లో ఒప్పందం చేసుకుంటే తప్పేంటీ..? లేకుంటా వాళ్ల ఆఫీసులకు వెళ్లి ఒప్పందాలు చేసుకోవాలా..? బీఆర్‌ఎస్, బీజేపీ  నేతల విమర్శలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రకు చెందిన రిలయన్స్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దావోస్‌లోనే ఒప్పందం చేసుకున్నారని, దీనికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 

ప్రవీణ్‌కుమర్‌ది బానిస మనస్తత్వం

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, అందుకు కేసు నమోదు చేసి వివరించాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి బానిస మనస్తత్వం, ఆయన ఆలోచన విధానం అందరికి తెలుసు.

ఏదో ఒక రోజు ఆ బానిస సంకెళ్లు  నుంచి తెంచుకుని బయటికి రావాలని కోరుకుం టున్న’ అని సీఎం పేర్కొన్నారు. ఏడాది క్రితం ఏమి మాట్లాడారు..? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు..? ఎవరి కోసం తాపత్రయపడుతున్నారనే అంద రం చూస్తున్నామన్నారు. ఈ ఫిర్యా దు ద్వారా అసలు విషయం పక్కదారి పట్టించాలనుకుంటే వారి భ్ర మ అని సీఎం వ్యాఖ్యానించారు.