calender_icon.png 18 November, 2024 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 24-25ల్లో దావోస్ సదస్సు

18-11-2024 12:29:54 AM

భారత్ నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు

న్యూఢిల్లీ, నవంబర్ 17: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రతీ ఏడాది ప్రారంభంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించే నిర్వహించే సద స్సు 2025 జనవరి 20న ప్రారంభమై, 25న ముగుస్తుంది. భారత్ నుంచి 100 కుపైగా వాణిజ్య, ప్రభుత్వ నేతలు హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ, బిజినెస్ లీడర్స్‌తో కలిసి ఈ వార్షిక సదస్సులో పాల్గొంటారు.

ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నేతలు ఇందు లో పాల్గొంటారని అంచనా. భారత్ నుంచి కేంద్ర మంత్రులతో సహా రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా, భారతి, మహీంద్రా, గోద్రేజ్, జిందాల్, బజాజ్, వేదాంత గ్రూప్‌ల నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దావోస్ సదస్సుకు హాజరవు తారు.

ప్రముఖ వాణిజ్యవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీతో పాటు టెక్నాలజీ లీడర్లు ఇన్ఫోసిస్ హెడ్ సలీల్ పరేఖ్, విప్రో రిషద్ ప్రేమ్‌జీ, పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, సెరమ్ ఇనిస్టిట్యూట్ అదర్ పూనావాలా తదితరులు తరలి వెళతారు. ’కొలాబరేషన్ ఫర్ ఇంటిలిజెంట్ ఏజ్’ అనే థీమ్‌తో ఈసారి దావోస్ సదస్సు జరుగుతుంది.