calender_icon.png 24 December, 2024 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్

24-12-2024 12:00:00 AM

  1. సీఎం పర్యటనకు రూ.12.30 కోట్లు మంజూరు 
  2. ఉత్తర్వులు జారీ చేసిన ఐటీశాఖ 

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): దావోస్‌లో జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో సీఎంతోపాటు రాష్ట్ర ప్రతినిధుల బృందం కూడా దావోస్‌కు వెళ్లనున్నది.

ఈ క్రమంలో సీఎం పర్యటనకు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ రూ.12.30 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్వర్తులు జారీ చేశారు. గత డిసెంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి 2024 జనవరిలో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారుల బృందంతో కలిసి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు. ఆ పర్యటనలో మొత్తం రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఇప్పటికే మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ ఏడాది మరోసారి దావోస్‌లో పర్యటించి మరోసారి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.