మాజీ క్రికెటర్ అనుమానాస్పద మృతి
బెంగళూరు: టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. డేవిడ్ బెంగళూరులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూ శారని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) తెలిపింది. ‘అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌లో జాన్సన్ ఉంటారు. గురువారం అతడు బాల్కనీ నుంచి కిందపడినట్లు సమాచారం అందింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే డేవిడ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు’ అని కేఎస్‌సీఏ పేర్కొంది.
కాగా డేవిడ్ జాన్సన్ 1996లో జాతీయ జట్టు తరపున రెండు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. రెండు టెస్టుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. కర్నాటక తరపున డేవిడ్ 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మాజీ బౌలర్లు జగవల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్, దొడ్డ గణేష్ తదితరులతో కలిసి కర్ణాటక బౌలింగ్ యూనిట్‌లో కీలకపాత్ర పోషించాడు. విషయం తెలుసుకున్న సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జగవల్ శ్రీనాథ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, బీసీసీఐ కార్యదర్శి జైషా.. డేవిడ్ జాన్సన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.