సూర్యాపేట, జనవరి 28 : నా భర్త నాకు కావాలని జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డు ఎన్టీఆర్ కాలనికి చెందిన భూపతి సరిత అలియాస్ రాజేశ్వరి మంగళవారం తన అత్తగారి ఇంటి ముందు ఆందోళనకు చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 10, 2023న భూపతి నరేందర్‌తో వివాహం జరిగింద న్నారు.
ఆయన తండ్రి మరణానంతరం ఆర్టీసీలో కండక్టర్‌గా యాదగిరిగుట్ట డిపోలో నాలుగు నెలల క్రితం ఉద్యోగం రాగా మరో వివాహం చేసుకుంటానని తనను నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అత్త ,మరిది ,అత్త తమ్ముడు తనను గత మూడు నెలలుగా చిత్రహింసలు, వ్యక్తిగత దూషణలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
నేను 15 లక్షల కట్నం ,పది తులాల బంగారం తీసుకువచ్చినప్పటికి మరల అదనంగా కట్నం తీసుకురావాలని మానసికంగా వేధిస్తున్నాడన్నారు. గత డిసెంబర్ లో విడాకుల కాగితాలు కోర్టు ద్వారా పంపితే లాయర్ ని నియమించుకొని పోరాటం చేసే విధంగా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నానని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నా బాధను అర్థం చేసుకొని న్యాయం చేయాలని వేడుకుంది.