11-02-2025 10:23:48 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన..
కామారెడ్డి (విజయక్రాంతి): ఓ పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్ కాలనీలో నివాసముంటున్న మేరీ కార్డు లక్ష్మి, పోశెట్టి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమార్తెగాక ఒక కుమారుడు ఉన్నారు. కూతురు మేరీకాడి సంజన 15 సంవత్సరాలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది.
సంజన పాఠశాలకు సరిగా వెళ్లడం లేదని సరిగా చదవడం లేదని పాఠశాల ఉపాధ్యాయులు తల్లికి ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి సంజనను మందలించింది. సరిగా చదవకపోతే పదో తరగతి ఫెలవుతావని చదువుపై శ్రద్ధ పెట్టాలని చెప్పి బయటకు పనికి వెళ్ళింది, దీనితో తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన సంజన తన ఇంట్లోని ఇనుప రాడ్డుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.