calender_icon.png 29 November, 2024 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతి వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ యోజన వరం లాంటిది

29-11-2024 02:33:14 PM

కరీంనగర్,(విజయక్రాంతి): దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి, కుల వారికి  కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం గొప్పవరం లాంటిదని డాటా ప్రో శిక్షణ కేంద్ర నిర్వాహకులు అన్నారు.  కరీంనగర్ పట్టణ ఏడో డివిజన్ బిజెపి నేత తోట సాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం  విశ్వకర్మ యోజన అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాటా ప్రో మేనేజర్ మాట్లాడుతూ... సాంప్రదాయ వృత్తులు చేసే, చేతివృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సాంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.  చేతి పనులవారు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం వారిని దేశీయ గ్లోబల్ మార్కెట్ తో  అనుసానిందించడం ఈ పథకం యొక్క మరొక ఉద్దేశమన్నారు. ముఖ్యంగా ఇందులో తొలత 18 సాంప్రదాయ వృత్తుల కు ఈ స్కీం ప్రయోజనాలు అందుతున్నాయని, అందులో వడ్రంగి, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు, రాతి పనిచేసేవారు.