జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను త్వరితగతిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు విద్యా చందన తో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, జిల్లా అధికారులు మరియు తాసిల్దార్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పోడు భూములు మరియు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దానికిగాను ఆసక్తిగల మరియు ఉత్సాహవంతులైన యువతి మరియు యువకుల ను డేటా ఎంట్రీ చేయడానికి నియమించు కోవాలన్నారు. తాసిల్దార్లు తమ పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లను ఉపయోగించుకోవాలన్నారు.
కొత్తగూడెం,పాల్వంచ, మణుగూరు, కరకగూడెం మరియు చర్ల మండలాల్లోడేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. డేటా ఎంట్రీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఎంట్రీ ఆపరేటర్లు డేటా ఎంట్రీ చేయనప్పుడు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.డేటా ఎంట్రీ ఆపరేటర్లుఎంత సమయం పని చేశారు, ఎన్ని దరఖాస్తులు ఎంట్రీ చేశారు అన్న పూర్తి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. చండ్రుగొండ, ములకలపల్లి మరియు ఇల్లందు మండలలో భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, తాసిల్దారులు తమ పరిధిలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా సెల్ ఉన్నాయో గుర్తించి వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు అందించాలని ఆదేశించారు. ఇల్లందు మండలం మామిడి గుండాలలో మరియు లక్ష్మీదేవి పల్లి రేగళ్లలో భూ సమస్యలపై తగిన నివేదికలు అందించాలని తాసిల్దారులను ఆదేశించారు.
జిల్లాలో పోడు పట్టాలు మంజూరు అయ్యి పాస్ పుస్తకాలు పొందని గిరిజన రైతులను ఐటీడీఏ అధికారుల సమన్వయంతో గుర్తించి, ఆ జాబితాను జిల్లా అటవీ శాఖ అధికారి సూచనలతో పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయటం ద్వారా పేద గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆ దిశగా నివేదికలు అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎన్ని పూర్తి అయి లబ్ధిదారులకు మంజూరు అయినప్పటికీ ధ్రువపత్రాలు జారీ చేయనవి మరియు పూర్తి అయి లబ్ధిదారుల ఎంపిక జరగని ఇళ్ల వివరాలు. ఏఏ మండలాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందుబాటులో ఉన్నవి తదితర వివరాలను నివేదికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ కు సూచించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థాపనకు అనువైన ప్రదేశాలు కొత్తగూడెం మండలంలో టేకులపల్లి లో మరియు భద్రాచలం పరిధిలో దుమ్ముగూడెం లేదా చర్ల లో స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో గుర్తించి తగిన నివేదికలు అందించాలని భద్రాచలం మరియు కొత్తగూడెం ఆర్డీవో లను ఆదేశించారు. బూర్గంపాడు మండలంలో బూర్గంపాడు గ్రామంలో అంబేద్కర్ నగర్ కాలనీ వరద ప్రభావిత ప్రాంతం పునరావసం కల్పించేందుకు బూర్గంపాడు లో అనువైన ప్రదేశం గుర్తించాలని తాసిల్దారును ఆదేశించారు.