calender_icon.png 2 October, 2024 | 7:59 AM

డాటా నమోదు పక్కాగా ఉండాలి

04-09-2024 01:13:49 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): వాస్తవ వాతావరణ పరిస్థితులు, వర్షపాత నమోదు ప్రక్రియ పక్కాగా చేపట్టాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. మంగళవారం ఆయన అమీర్‌పేటలోని ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రాలను సందర్శించారు. ఆటోమెటిక్ వాతావారణ కేంద్రం పనితీరు, వర్షపాతం నమోదు ప్రక్రియపై ఆరా తీశా రు. అనంతరం ఖైరతాబాద్ చింతల్‌లోని తెలంగాణ ప్రణాళికా సంఘాన్ని సందర్శించారు. వర్షపాతం అంచనా, వాస్తవ వర్షపా త నమోదు ప్రక్రియను పరిశీలించారు. 154 ఆటోమేటిక్ డేటా వాతావరణ కేంద్రాల నిర్వహణ సమర్థంగా ఉండాలన్నారు. రిమో ట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌ను సందర్శించారు. శాటిలైట్ మ్యాప్‌లకు సంబంధించిన డేటాను పరిశీలించారు.