17-04-2025 02:03:18 AM
హాజరైన బండా ప్రకాశ్, కేటీఆర్, హారీశ్‌రావు తదితరులు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన చాంబర్‌లో శ్రవణ్‌కుమార్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఙతలు తెలిపారు. ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతానన్నారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.