తొలినాటి తెలంగాణ వైతాళికులలో దాశరథి కృష్ణమాచార్య అగ్రగణ్యులు. అలాంటి మహాకవి శత జయంతిని పురస్కరించుకొని వారి జీవితాన్ని, లభ్య రచనలను ఎన్నుకొని వాటిపైన నిష్ణాతులైన అనేకమంది సాహితీవేత్తలతో వ్యాసాలు రాయించి, వాటిని దాశరథి ప్రత్యేక సంచికగా ‘పునాస’ పత్రికను తెలంగాణ సాహిత్య అకాడెమి ప్రచురించింది.
దాశరథితో ఆనాడు ప్రత్యేక అనుబంధం ఉన్న కొందరు సాహితీవేత్తల అభిప్రాయాలనూ ప్రచురించారు. అపురూపమైన ఈ సంకలనం దాశరథి అభిమానులతోపాటు ఉపాధ్యాయులు, పరిశోధకులు, పాఠకులు, మొత్తంగా తెలుగు సాహితీ లోకానికి ఎంతో ఉపయుక్తకరం. 230 పేజీలలో దాశరథి ఛాయాచిత్రాలతో మంచి కాగితంపై రూపొందిన ఈ అపురూప గ్రంథం అన్ని గ్రంథాలయాలు, కళాశాలలలో ఉండదగింది.
ప్రతులకు: కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్. ఫోన్: 040-29703142, సెల్: 86861 82382